గ్లోరియా మహోన్నత గీతం – Gloria Mahonnata Getam
1stanza.
మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ ఘనత ప్రభావం
భూలోకమున మంచి మనసున్న మనుజులకు శాంతి
ప్రభువైన సర్వేశ్వర – పరలోక రాజా
సర్వశక్తిగల మాదేవా – పితయైన సర్వేశ్వర
మిమ్ము పొగడు చున్నాము
మిమ్ము స్తుతించుచున్నాము
మిమ్ము నారాధించుచున్నాము
మిమ్ము కీర్తించుచున్నాము
2nd Stanza
మీ మహా వైభవమునకు
మీకు వందనములర్పించేదం
జెనీతైక పుత్రుడా మా ప్రభువా
ఏసుక్రీస్తువా
ప్రభువైన సర్వేశ్వర – సర్వేశ్వరుని గొర్రెపిల్ల
పిత యొక్క పుత్రుడా – లోక పాపములను
పరిహరించు వాడవు ప్రభువా
మా మనవి నాలకించండి
పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా
మాకు దయ చూపుము
3rd Stanza
ఏలయన నీవు మాత్రమే – నీవు మాత్రమే పవిత్రుడవు
నీవు మాత్రమే ప్రభుడవు – నీవు మాత్రమే మహోన్నతుడవు
ఏసుక్రీస్తువా పితయైన సర్వేశ్వర,
పితయైన సర్వేశ్వరుని మహిమలో,
పవిత్రాత్మతో నుండు ప్రభువా
ఆ………మెన్ ఆ…..మెన్
ఆ……..మెన్ ఆ……మెన్


