జన్మించెను రక్షకుడు మన కొరకు – Janmincenu Rakskudu Mana koraku
జన్మించెను రక్షకుడు మన కొరకు
దిగి వచ్చెను యేసయ్య భువి వరకు .. (2)
మలినమైన మనుషుల కోసం..
చేజారిన లోకం కోసం..
మన చీకటి బ్రతుకుల కోసం..
చిగురించే ఆశల కోసం…
Happy Happy Christmas.. Merry merry christmas…(2)
చ: వాక్యనుసారము జరిగించుటకు…
తన తండ్రి మాటలను నెరవేర్చుటకు… (2)
రాజుల కే రాజుగా.. జ్ఞానులకే జ్ఞానిగా… (2)
ఈ లోకమునకు ఏతెంచెను ..యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
(Happy)
చ: న్యాయమును జరిగించుటకు… వ్యాధి బాధలను తొలగించుటకు.. (2)
ఆదరణ కర్త గా… అందరికీ ప్రభువుగా.. (2)
ఈ లోకమునకు ఏతెంచెను…యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
(Happy)
చ: తన తండ్రి ప్రేమ ను ప్రకటించుటకు…
ఈ లోక పాపమును తొలగించుటకు… (2)
మహిమ గల వ్యక్తి గా.. మహోన్నత శక్తి గా…(2)
ఈ లోకమునకు ఏతెంచెను ..
యేసు ఈ లోక రక్షకుని గా ఉదయించెను
(Happy)
జన్మించెను రక్షకుడు మన కొరకు |Joshua Gariki |NagaRaju | Suresh | 4K | Latest Christmas song 2023


