తూర్పు దిక్కున – Turpu dikkuna lyrics
తూర్పు దిక్కున – Turpu dikkuna lyrics
1.తూర్పు దిక్కున
తూర్పు దిక్కున చుక్క పుట్టెను
ప్రజలందరికి వార్త తెచ్చెను
దూత ఒకటి దర్శనమించెను
ప్రజలందరికి శుభ వార్త తెచెను
ఇక సంతోషమే ఇక సంబరమే
లోకరక్షకుడు పుట్టాడని
సర్వలోకాధికారి వచ్చాడని
పాపుల రక్షకుడు పుట్టాడని
పరమును వీడి వచ్చాడని
2.పరిశుద్ధుదాత్మా తో కన్యామరియ గర్భాన
పరమును వీడి పశువుల పాకలోన
పాపమును బాపుటకు పరిశుద్ధుడిలా
ప్రజలను విడిపించ ప్రభుదిగివచ్చెను
ఇక సంతోషమే ఇక సంబరమే
పాపుల రక్షకుడు వచ్చాడనీ
ప్రజలదారి ప్రభువు వచ్చాడని |2|
3.బలుడుకాదు బలవంతుడు యేసయ్య
సర్వలోకానికి రక్షణతెచడయ్య
ప్రభువును నమ్మితే నీపాపము పోవునయ్యా
నమ్మినవారికి నరకము తప్పించును
ఇక సంతోషమే ఇక సంబరమే
బలవంతుడు భువికే వచ్చాడని
సర్వలోకానికే ప్రభువు వచ్చాడని |2|
4.మహిమనువిడిచి మనకైవచ్చాడు
మనఅందరికి పరలోకముఇచ్చాడు
అపవాదిని జయించుటాకు వచ్చాడు
వాడితలను చితక త్రోక్కుటకైవచ్చెను
ఇక సంతోషమే ఇక సంబరమే
మహిమగల రాజు వ్చ్చాడని
మనందరి ప్రభువు వచ్చాడని |2|