దేవా ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయా – BOUI క్రైస్ట్ చర్చ్ బోనకల్లు
ఈ లోకములో ఒక మనిషి సంపాదించుకోగలిగిన గొప్ప భాగ్యం ఏదైనా ఉంది అంటే అది నీ సేవ మాత్రమే ..అంతటి మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవా … ఏమిచ్చి నీ ఎదుట నే నిలువ గలను ..ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలను. విలువలేని నాకు విలువ నిచ్చినావు పాపినైనా నాకొరకు ప్రాణమిచ్చినావు //2//
అయోగ్యుడను తండ్రి నన్ను యోగ్యునిగా మలచి నాపాప భారమంతా సిలువ పైన మోసి /2//
ఈ ఆత్మల భారాన్ని నా భుజములపై ఉంచవా//విలువలేని/
1)పరిశుద్దుడవగు ప్రభువా నీ పరిశుద్ద రక్తముతో
నా పాప దోషములను కడిగి వేసావు
పరిశుద్దుడవగు తండ్రి నీ పరిశుద్ధ వాక్యముతో
పడిపోయిన నన్ను నిలువ బెట్టినావు
తండ్రి … తండ్రి … తండ్రి యని పిలువగా చెంతన నిలిచావు
తండ్రి … తండ్రి … తండ్రి యని పిలువగా నీ సేవలో నిలిపావు. //విలువలేని//
2)నిత్యుడగు తండ్రి నీ నిత్య సంకల్పపాముకై
భారమెంతయైన మోసే ధైర్యమిచ్చినావు
నిత్యుడగు తండ్రి నీ నిత్య రాజ్యములో
కొందరినైనా చేర్చే ధన్యతిచ్చినావు
అందుకే ..అందుకే…అందుకే ఈ నా హృదయార్పణ
అందుకే ..అందుకే… నేను కన్నీళ్లతో రాసా ఈ కీర్తన//విలువలేని//


