పరమునుండి పల్లెటూరికి – Paramu nundi palle seemaku
పరమునుండి పల్లెటూరికి – Paramu nundi palle seemaku
పరమునుండి పల్లెటూరికి..
పల్లెసీమల్లో పుట్టినాడే రక్షకుడు
పేదోళ్ల ఇంట్లో వెలిసినాడే విమోచకుడు “2”
లోకమునెంతో ప్రేమించినోడే
పాపమునంతా మోసెటి వాడే
పరమునుండి పల్లెటూరొచ్చినాడే
పరమాత్ముడైయుండి నరుడైపుట్టాడే
ఇమ్మానుయెలై మన మద్యకొచ్చాడే!
మనలోనే ఒకడై మనతో నిత్యముంటాడే!!
“పల్లెసీమల్లో”
కమ్ముకున్న చీకటిలోన..కానరాని రాతిరిలోన
కన్యమరియగర్భములోన..బెత్లహేము గ్రామములోన “2”
పరిశుద్ధాత్మలో పుట్టినవాడై..పశులపాకలో పవలించినోడై
పాపమేమి లేనట్టి వాడై..మలినమేది అంటని వాడై
పరమునుండి వచ్చి పల్లెటూరిలో జన్మించినాడే
మహిమనంత విడిచి మట్టిమనుషుల్లో జీవించినాడే “2”
దేవుడే..పంపిన దైవకుమారుడే
దీనుడై..పుట్టిన లోకరక్షకుడే!”2″
లోకాలనేలేటి రారాజు తానై
జగములే కొలిచేటి దైవమయ్యాడే
రాజులకు రాజైన మహారాజు తానై
దివినుండి భువికి దిగివచ్చినాడే
సర్వాధికారై మన మద్యకొచ్చాడే!
మనలోనే ఒకడై మనను పాలించువాడే!!
“పల్లెసీమల్లో”
మనుషులంతా పాపములోన..బ్రతుకుతున్న లోకములోన
చిక్కుకున్న శాపములోన..దిక్కులేక శోకములోన
మార్గము సత్యము తానై..నిత్యజీవమిచ్చెటి వాడై
నిన్ననేడు మారని వాడై..ఆదిఅంతమైయున్నవాడై
మనిషికోసమొచ్చి మనుష్యరూపమే ధరియించినాడే
మచ్చలేని మనిషై స్వచ్ఛమైన మనసున్నవాడే
దేవుడే..పంపిన దైవసంభూతుడే
దీనుడై..పుట్టిన లోకవిమోచకుడే!
లోకాన్ని ప్రేమించి ప్రాణమిచ్చాడే
మరణాన్ని గెలిచి తిరిగిలేచాడే
అపవాదినోడించి జయశీలుడాయే
సింహాసనముపై ఆశీనుడాయే
“ఆదరణకర్తయి మన మద్యకొస్తాడే!
మనలోనే ఒకడై తనతో తీసుకెళ్తాడే!!