Avakasam Poyakaa – అవకాశం పోయాక పొందే మారుమనసు
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం (2)
మనిషి దూరమయ్యాక తనపై చూపించే ప్రేమ వ్యర్థం….
మంచి కొరకు ఉపయోగించని ధనం ఎంత ఉన్న వ్యర్థం (2)
వ్యర్థ వ్యర్థం ఈభూమి పై జరుగుతున్నదంతా వ్యర్థం
వ్యర్థం వ్యర్థం సొలొమోను అనుభవించి చెప్పెను సమస్తం వ్యర్థం..
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం
వస్త్రముకంటే దేహమును దేహము కంటే ప్రాణమును
ప్రాణముకంటే నీలో ఉండే ఆత్మ గొప్పదికాదా…..(2)
వెంటరాని దేహంకొరకు ఎంతో శ్రద్ధ చూపిస్తావు
నిత్యము నిలిచే ఆత్మకొరకు ఎపుడైనా యోచించావా(2)
ఈభూమిపై ఉండగానే నీ గమ్యస్థానం తెలుసుకో
కనుమూయకముందే దేవుని తెలుకొనీ…ఈ
నీబ్రతుకు సరిదిద్దుకో
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం
లోకమంతా సంపాదించి పోయే ప్రాణం నిలుపలేవు
ప్రాణమిచ్చిన క్రీస్తును నమ్మితే రక్షణ భాగ్యము కాదా…_ (2)
నీతిమంతుడు రోగముతో మరణించిన ఆత్మకే
బాదుండదు పాపంతో మరణిస్తే ఆత్మకు నరకమే తప్పదు (2)
పాపాలనుండి రక్షింపబడుటకూ…. మారుమనసును పొందుమ….
పాతాళము నుండి తప్పించుకొనుటకూ….
క్రీస్తుయేసుని ధరిఇంచుమా….
అవకాశం పోయాక పొందే మారుమనసు వ్యర్థం
ధనవంతుడు పాతాళంలో పొందిన మార్పు వ్యర్థం (2)
మనిషి దూరమయ్యాక తనపై చూపించే ప్రేమ వ్యర్థం…
మంచి కొరకు ఉపయోగించని ధనం ఎంతఉన్న వ్యర్థం (2)
సత్యం సత్యం ఈ భూమిపై నీతిగా బ్రతుకుటె ప్రాముఖ్యం
నిత్యం నిత్యం దేవుని ఆజ్ఞలు నెరవేరిస్థె పరలోకమే నిశ్చయం….నిశ్చయం




