Chuchithi Ni Momupai – చూచితి నీ మోముపై
114
Telugu songs
Shop Now: Bible, songs & etc
Chuchithi Ni Momupai – చూచితి నీ మోముపై
చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మఖుఠము మారిపోయే – ముళ్ల ముఖుఠముగా
సింహాసనమే శిలువగ మారే – శిక్షకు గురియాయేగా
” పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే చాలని – నీ చెంత చేరితిని” యేసు…..”చూచితి”
1. నేలపై ఒలికిన నీ రక్త ధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్త ధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను “2”
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు “2”
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే “2” యేసు…..”చూచితి”
2. సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని కడిగెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను “2”
మా రోగములను – భరియించుటకు “2”
మాపై నీకున్న ఎనలేని ప్రేమను
అవహేళన చేసిరే “2” యేసు…..”చూచితి”
- வருத்தப்பட்டு பாரம் சுமந்தது – Varuthapattu Baaram Sumanthathu
- Kannimari Palanai – Merry Merry Merry கிறிஸ்மஸ்
- அன்பு உள்ளம் கொண்டவரே – Anbu ullam kondavarey
- பாலன் இயேசு உனக்காக – Balan Yesu Unakkaga
- உமக்காகவே நான் உயிர்வாழ்கிறேன் – Umakaagavae Naan Uyirvazhgiraen