Dhanyudu Deva Manavudu Dhanyudu – ధన్యుడు దేవ మానవుడు
Dhanyudu Deva Manavudu Dhanyudu – ధన్యుడు దేవ మానవుడు
ధన్యుడు దేవ మానవుడు
ధన్యుడు – ధన్యుడు దైవజనుడు
ధరణి జనులందరి కన్న- అన్యులెంతటి
వారైన అతనికి సాటి రారు
చెడుగుల యోచనలందు – నడువని వాడై పాపులు
అడుగు బెట్టుదారుల- యందు నిలువని యతడు
పరిహసించు వ్యతిరేక – ప్రజలు గుమిగా గూర్చుండు
దరిని గూర్చుండ నట్టి – నరుడెవ్వడో యతడు
మురియు దైవాజ్ఞలున్న – పరిశుద్ధ శాస్త్రము జూచి
మురియుచు రేబగళ్ళు- స్మరియించుచుండు నతడు
అతడేటి యోర మొలిచి – ఆకు వాడనిదై తగిన
ఋతువున గాయు చెట్టై – హెచ్చరిల్లును గాన
అతడు తలపెట్టి చేయ – యత్నించు నెల్ల పనులు
సతతము సంపూర్ణముగ సఫల మగుచుండును గాన
ఆలా గుండకను దుష్టుల్ – గాలి కొట్టిన పొట్టున్
బోలిన వారై చెదరి – పోదు రంతర్ధానంబై
కాన దుష్టుల్ తీర్పు – లో నిల్వ నేలేరు
హీనుల్ నీతి పరుల – లో నాగనే లేరు
పరమ దేవునికి నీతి – పరుల మార్గంబు తెలియు
దురితుల పన్నాగములు – సరిగా కీడునకే నడుపు