నాలో ఏమంచి లేకపోయినా – Nalo Emanchi Lekapoyina
పల్లవి
నాలో ఏమంచి లేకపోయినా
నీ ప్రేమను చూపి నన్ను రక్షించినావు
నశించుపోవుచున్న నా జీవితములో
మంచి సమరయునివై నన్ను రక్షించినావు
నా జీవితములో నీవు చేసిన మేలులను
వర్ణించలేను నా యేసయ్యా
నా జీవితములో నీవు చేసిన మేలులను
వివరించలేను నా యేసయ్యా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ మధురము
యేసయ్య యేసయ్య మధురాతి మధురము
1.పాపములో లోకములో తిరుగుచున్న నన్ను
అపవాది కోరలలో చిక్కుకున్న నన్ను
నీ ఉన్నత ప్రేమ చూపి రక్షించినావు
విలువైన నీ కృపను నాపై చూపినావు
2.బంధువులు స్నేహితులు ఎందరో ఉన్నను
నీలా ఆదరించే ప్రేమలేకపోయెను – నా
నేనున్నానంటూ నను ధైర్యపరచినావు
కృంగిన ప్రతిక్షణము నా తోడై ఉన్నావు
3.నాకంటే జ్ఞానులు ఎందరో ఉన్నను
ఎన్నికేలేని నన్ను ఎన్నుకున్నావు
విలువలేని నాకు విలువనిచ్చినావు
నా ప్రాణమున్నంత వరకు నీకై జీవించేదా
Nalo Emanchi Lekapoyina lyrics,alvary Pilupu Christian Song, Telugu christian song


