నను కోరుకున్నావయ్యా – Nanu korukunna prema song lyrics
ఏమంచి లేకున్నా
ప్రేమించినావయ్యా
ఏమున్న లేకున్నా
నను కోరుకున్నావయ్యా “2”
(ఏ)యోగ్యత,అర్హత లేకున్ననూ
నా జీవితయాత్రలో
తోడున్నావు “2”
నీవున్నావనే ధైర్యము
యేసయ్యా నీతోనే
నా జీవితము “2”
” ఏమంచి లేకున్నా ” “2”
1..నా గతమంతా
గురిలేని కిరణాలే
నా జీవితంలో ఎన్నో
మరపురాని సుడిగుండాలే “2”
ఎన్నో కలవరాలు
మదిలో వేదించే “2”
విడువక ఎడబాయక
తోడున్నావూ
మనుషులవలే నీవు
చేయి విడువవు “2”
చేయి విడువవు
” ఏమంచి లేకున్నా ” “2”
2..నలిగిన నా బ్రతుకును
నడిపించు యేసయ్యా
గురియొద్దకు ఓపికతో
పరుగెత్తిన పౌలులా “2”
నిలువలేక ఉన్నానయ్యా
నీవే నా దిక్కయ్యా
ఈ లోకాన నాకంటూ
ఆశేదీ లేదయ్యా
“నీ పనిలో పాత్రగా
వాడుకో సాక్షిగా
కరిగిపోతాను
కలువరిగిరి సేవలో” “2”
కలువరిగిరి యాత్రలో.



