Vadhuvu Sanghamu Varuni Koraku Eduru Chuchuchunnadi – వధువు సంఘము వరుని కొరకు

Vadhuvu Sanghamu Varuni Koraku Eduru Chuchuchunnadi – వధువు సంఘము వరుని కొరకు

వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది
అధమమొక్క పాపమైన – అంటకుండ నున్నది
అంటనీయకున్నది అంటు అంటనుచున్నది

వరుని ప్రేమ స్మరణతోనే – పరిపూర్ణమౌచున్నది
వరుని మీదనున్న ప్రేమ-పెరగనిచ్చుచున్నది
తరగనీయకున్నది-వరుడు వరుడను చున్నది

‘త్వరగ’ ననగా గురుతులైన – తరువాత అనుచున్నది
గురుతులు జరిగిన దొంతి – గురుతు పెట్టుచున్నది
వరుని గురుతున నున్నది – గురుతు గురుతనుచున్నది

‘త్వరగనన్నది’ నరునియాత్మకు – ప్రవచనమనుచున్నది
ఇరువదివందల యేండ్లయినను – ‘త్వరగ’నే యనుచున్నది
వధువు సిద్ధమనచున్నది – వధువు వధువనుచున్నది

గురుతులను ప్రవచనములను – గణియించుచున్నది
సరిగనున్నవి రెండుననుచు – మురియుచునే యున్నది
తరచు తరచు చున్నది – సరియె సరియనుచున్నది

ఆడితప్పనివాడు రాక – అట్టేయుండడనుచున్నది
నేడు వచ్చి వేసినట్టే – పాడుకొనుచున్నది
కీడు చూడకున్నది నేడు నేడనుచున్నది

వరుడు వధువు నొక్కటే గనుక త్వరగా నిజమనుచున్నది
‘త్వరగ’లో ఇద్దరు దంపతులుగా బరుగు చుండ్రనుచున్నది
నిరుకు బ్రతుకనుచున్నది – నిరుకు నిరుకనుచున్నది

‘త్వరగ’ కడ్డులు లేవను నర్ధము విరివిగా చెప్పుచున్నది
నరులు నపవాదియు నడ్డు పరుపలేరనుచున్నది
వరుడడిగో యనుచున్నది పాపహరుడనుచున్నది

తేదిరాక కున్నదన్న లేదు లేదనుచున్నది తేది అపుడు
తెలియు నన్న – తెలియనగు ననుచున్నది కాదు
ఇపుడనుచున్నది తేది తేదియనుచున్నది

చేయడేమియు ప్రభువు సభకు చెప్పనిదె యనుచున్నది
ఆయత్తమౌనాటికి తేది – అందుననుచున్నది
మాయలేదనుచున్నది హాయి హయి యనుచున్నది

ఇక్కడను పైనక్కడను – ఒక్క కుటుంబమే యగును
లెక్కకు రెండగును మరిమొక – లెక్కకు నొక్కియే యగును
ఒక్కియే మందయగును – ఒకియే సంఘమగును

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo