Shop Now: Bible, songs & etc
Premanu Minchina – ప్రేమను మించిన దైవమా
ప్రేమను మించిన దైవమా
నీ రుణమును నేతీర్చగలనా
ప్రాణమునిచ్చిన జీవమా
నీ త్యాగమూ మరువగలనా
నా బలమంతా ఇచ్చినా
బంగారం అర్పించినా
సాగిలపడి పూజించినా స్వాస్థ్యములే రాసిచ్చినా
యుగయుగముల నీ ప్రేమకు చాలునా
స్తోత్రమయా యేసయ్యా
నీ నామమే అతి మధురం
ఆపవాది ఉరిలో నేపడియుండగా గర్జించు సింహమై నా పక్షమైతిని ||2||
పరలోకమునకు నను చేర్చుటకు
పరిశుద్ధాత్మను నాలో ఉంచి సర్వసత్యముకు నడిపితివి ||2||
||స్తోత్రమయ్యా॥
నీ చిత్తమును నే నెరవేర్చక మోయలేని శాపము పొందెను
సమ్మతించి నీ మాట వినగా
తరగని ఆశీర్వాదమునిచ్చ
నీ సొత్తుగా నను చేసితివి ॥2॥
॥స్తోత్రమయా॥
ప్రార్ధన వినెడి ఓ పావనుడా ఉత్తరమిచ్చుటలో నీ సాటి ఎవరూ
లేమి స్థితిలోన నే మునిగిననూ తగినటువంటి సమయములోన
నీ సాయమునే పంపితివి ॥ 2॥
॥స్తోత్రమయా॥
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."