![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
నీతి సూర్యుడే ఉదయించెను – NETYAJEVAMI DEHA RUPAMI
నీతి సూర్యుడే ఉదయించెను – NETYAJEVAMI DEHA RUPAMI
పల్లవి
నిత్యజీవమే దేహరూపమై నాకై జన్మించెను
నీతి సూర్యుడే అంధకారలోయలో నాకై ఉదయించెను
నూతన జన్మను పొందాలనీ
నూతన సృష్టిగ మారాలనీ
నూతన వధువునై వుండాలనీ
నూతన యేరుషలేమ్ చేరాలనీ //2//
శ్రీమంతుడే రిక్తుడైయ్యాడుగా
నా బ్రతుకులో దీపమైయ్యాడుగా-దీపమైయ్యాడుగా
//నిత్యజీవమే//
చరణం – 1
శిల్పిఅయిన దేవుడే సిలువనెక్కగా పుట్టాడనీ
విలువలేని నన్ను విడువక విలువపెట్టి కొన్నాడనీ //2//
యేసయ్యే కొన్నాడనీ – నేను నా సొత్తుకాననీ
అరణ్యజీవిననీ – మధురమన్నాగా వచ్చావనీ
//నూతన //
చరణం – 2
భీకర రూపము వదులుకొనీ దాసుని రూపము దాల్చుకొనీ
మరణపు ముల్లును విరవాలనీ మహిమను విడచీ వచ్చావనీ //2//
గొప్పదేవుడు నీవేననీ – నను దీవింపవచ్చావనీ
నీ వాత్యల్య వర్షముతో- నను చిగిరింపజేయాలనీ
//నూతన//
చరణం – 3
పాపపు విషముతో నిండుకొనీ – నీతిహీనమైయుంటినీ
చెడిన నన్ను కడుగుటకై పరము వీడి వచ్చావనీ //2//
బలిపశువుగ వచ్చావనీ- నను జీవింపజేయాలనీ
నీ కృపబాహూళ్యముతో నను ఆశీర్వదించాలనీ
//నూతన//