![GOD MEDIAS](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/GOD-MEDIAS-512-1-150x150.png)
పరిశుద్దుల అనురాగ నిలయం – PARISHUDHULA ANURAGA NILAYAM
పరిశుద్దుల అనురాగ నిలయం – PARISHUDHULA ANURAGA NILAYAM
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం.
దేవదేవుడు మనకిచ్చె ఆశ్రయం.
తనయులపై తండ్రి కృప చూపగా
తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా-
స్తుతియే ధ్యాసగా – త్యాగమే శ్వాసగా
అపురూపు బంధాల సౌధముగా
అణువణువు పులకించె మధురిమగా
మర్మాల నిధిగా – ప్రవహించే జీవనదిగా
ఎండిన బ్రతుకుల జీవింపజేసే జీవాలయం ఈ దేవాలయం.
వాఖ్యమే నడతగా – ఆత్మయే సారథిగా
చిగురించి ఆశల కోవెలగా
చిరకాల వాసమై నిలిచేనుగా
యేసయ్యే గురిగా – ఆనందాల ఝరిగా
అన్ని వేళల ఆదరించే
నిత్యాశ్రయం ఈ దేవాలయం
దేవాలయం ప్రార్ధనాలయం