![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
శాశ్వతము కాదు ఏ బంధము సాంగ్ – Sasvathamu kadu ye bandhamu
శాశ్వతము కాదు ఏ బంధము సాంగ్ – Sasvathamu kadu ye bandhamu
పల్లవి :
శాశ్వతము కాదు ఏ బంధము
యేసే నీ తోడు సదాకాలము (2)
ఎన్నడు విడువనివాడు
ముదిమి వచ్చువరకు
నిను ఎత్తుకుంటాడు (2)
1 చరణం :
కాదనుకొని వెళ్లిన బంధము కొరకు
కుమిలి కుమిలి యేడ్చుట ఎందుకొరకు? (2)
నిన్ను కోరి వచ్చి ప్రాణమునే పెట్టిన (2)
యేసు ప్రేమ తలపోయుము నా ప్రాణమా (2)
2 చరణం :
మరల తిరిగిరాని బంధము కొరకు
మరిచిపోక యేడ్చుట ఎందుకొరకు? (2)
నిన్ను కొనిపోవ తిరిగి రానైయున్న (2)
యేసు కొరకు సిద్దపడు నా ప్రాణమా (2)