kristavuda nee payanametu – క్రైస్తవుడా నీ పయనమెటు
kristavuda nee payanametu – క్రైస్తవుడా నీ పయనమెటు
పలవి :
క్రైస్తవుడా… నీ పయనమెటు?- నిత్యమైన ఆనంద స్థలమా? నిత్యమైన ఆవేదన స్థలమా? విశ్వాసీ… నీ దారేది? – యేసు వెళ్ళినా దారేనా? దుష్టుని దారిలో నీవు ఉన్నవా? ॥ క్రైస్తవుడా ||
1) యోబులా నీవ్ పయనిస్తే – నిత్యమైన ఆనంద స్థలం యోబు భార్యల నీవుంటే – వేదన స్థలము నీకేగా లాజరులా నువ్ పయనిస్తే – నెమ్మది స్థలము నీకుంది ధనవంతుడిలా జీవిస్తే – వేదన లోనే పడతావు యోబు లాంటి విశ్వాసంతో – దేవునిలో నీవు కొనసాగు లాజరు లాంటి దీనత్వంలో- తండ్రినే నీవు ఘనపరుచు
|| 2 ||
॥ క్రైస్తవుడా॥
2) దేవుని దారిలో నడచినా – పేతురునే నీవు చూడు దేవుని దారినే విడచినా – ఇస్కరియోతు ని చూడు పేతురు లాంటి మార్గాన్నే ఎంచుకుంటేనే మంచిది – ఇస్కరియోతు మార్గాన్ని – విడిచిపెడితేనే మంచిది యేసే నీకు మార్గమని – తెలుసుకోవ నేస్తమా పరలోకమే నీ గమ్యం చేరుకో ఓ సోదర –
|| 2 ||
॥ క్రైస్తవుడా॥
ఓ మనిషి… నీ ఆశ ఏంటి – పరమతండ్రితో సాంగత్యమా? రెండవ మరణం పొందటమా?