Shop Now: Bible, songs & etc
NEDAINA NIJAMAINA – నేడైనా నిజమైన
నేడైనా నిజమైన రక్షకుని చేరుమా పాడైనా నీ స్థితిలో స్వస్థతను కోరుమా
నా దేశమా నా భారతదేశమా “2”
నువ్వొస్తే మనసిస్తే మార్చబడతావు నా క్రీస్తే సెలవిస్తే బాగుపడతావు “2”
“నా దేశమా “
1.సృష్టికర్తను ఎరుగక పాపిగ జీవించినా
దృష్టి తండ్రిపై నిలుపక భ్రష్టతలో ఉండినా “2”
జాలి కలిగి తన ఉగ్రతనింకా పంపుటలేదు సుమా “2”
నువ్వొస్తే మనసిస్తే మార్చబడతావు నా క్రీస్తే సెలవిస్తే బాగుపడతావు “2”
2.సత్యవాక్యము నమ్మక దేవుని దూషించినా
నిత్యజీవము పొందక చీకటిలో ఉండినా”2”
ప్రేమకలిగి నిను ఆహ్వానించుట మానుట లేదు సుమా”2”
నువ్వొస్తే మనసిస్తే మార్చబడతావు నా క్రీస్తే సెలవిస్తే బాగుపడతావు “2”
Tags: A.R. Stevenson