SUDHOORAMU – సుదూరము ఈ పయనము ముందు ఇరుకు
Shop Now: Bible, songs & etc
SUDHOORAMU – సుదూరము ఈ పయనము ముందు ఇరుకు
LYRICS:
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము
1. అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
2. హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును
3.నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ