![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
మనకై చీల్చబడిన – Manakai cilcabadina
మనకై చీల్చబడిన – Manakai cilcabadina
మనకై చీల్చ బడిన – మహిమ బండ క్రీస్తే
మహోన్నతుని చాటుననే మరుగౌదుము నిరతము
1 నాశనగుంట నుండి – నరక ఊబినుండి
పైకెత్తి నిలువబెట్టి – బండపై నన్ను స్థిరపరిచే || మనకై ||
2. కొండా తేనెతో బలపరిచి – కరుణైశ్వర్యముతో నింపి
బండనుండి నూనె పొర్లించి – ప్రవహింపచేయును మనకై || మనకై ||
3. ఆ బండ యేసుక్రీస్తే – ఆశ్రయ దుర్గమాయె
ఆపదలో నిత్యకృపతో – కాపాడు దేవుడాయే || మనకై ||
4. ప్రభు దివ్య దర్శనము – పరదైసు దైవికము
బండ సందులోనుండి తానే – ప్రత్యక్ష పరుచును మనకై || మనకై ||