Shop Now: Bible, songs & etc
తరాలు మారిన – THARALU MARINA
పల్లవి: తరాలు మారిన – యుగాలు మారిన (2)
మారని దేవుడు – మన యేసు నాధుడు
మారని బ్రతుకులు – మార్చేటి దేవుడు (2) తరాలు (2)
1. నిన్న నేడు నిరంతరము – ఒకటిగా ఉన్న నిత్య దేవుడు (2)
నిన్ను నన్ను ఏండ్ల తరబడి – కాచే దేవుడు (2)
ప్రేమ దేవుడు – మన యేసు దేవుడు
సత్య దేవుడు – సర్వ శక్తిమంతుడు (2) తరాలు (2)
2. ఎంతటి కఠిన పాపినైన – రమ్మని పిలిచే జాలి దేవుడు (2)
క్రూరులైన జారులైన – చోరులైన ఎవ్వరైనా (2)
కరములు చాచి – క్షమించు దేవుడు
ఓదార్చు దేవుడు – దీవించు దేవుడు (2) తరాలు (2)