ధరణి మురిసెను ఈ శుభ వార్తతో – Dharani Murisenu Ee Shubavartha Tho
ధరణి మురిసెను ఈ శుభ వార్తతో – Dharani Murisenu Ee Shubavartha Tho
ప: ధరణి మురిసెను ఈ శుభ వార్తతో
నా హృదయం ఉప్పొంగెను
రారాజుని జననంతో – నారాజు నీ జననంతో
ఆనందమే ఆర్భాటమే సంతోషమే సమాధానమే
చ.1: లోకమంతా చీకటితో నిండగా
నీ వెలుగును నా బ్రతుకులో నింపగా
దివి నుండి భువికి మహిమంతా విడచి
నర రూపిగా మాకై దిగి వచ్చినావు
నీ రాక మా కోసం దివ్యమైన వేడుక
ఈ లోకానికి అది దివ్యమైన పండగ
చ.2: పాపమంతా ఏలుబడి చేయగా
నీ రుధిరం మా బ్రతుకుకై చిందగా
పాపికి రక్షణ – పాప క్షమాపణ
కలిగించ మమ్మెంతో ప్రేమించినావు
నీ రాక మా కోసం దివ్యమైన కానుక
ఈ లోకానికి అది దివ్యమైన పండగ
Tags: | latest new telugu christmas songs 2020 | samy pachigalla2019 TELUGU CHRISTMAS SONGS2020 telugu christmas songs2020telugu christmas songs2021 latest.telugu christmas songs 20222021 TELUGU CHRISTMAS SONGS2021telugu christmas songs2022 telugu christmas songsall time best telugu christmas songsAnand RajaBenjamin SudheerKanna RubensSofia Glory