Yesu Nee Krupayega – దేవా నీ కృప పొందుటకు
161
Telugu songs
Shop Now: Bible, songs & etc
Yesu Nee Krupayega – దేవా నీ కృప పొందుటకు
దేవా నీ కృప పొందుటకు – నాలోన ఏమున్నది
మలినమైనది నా గతం – చేజారినది నా జీవితం
ఉదయించే నాలో నీ స్వరం – వికసించెనుగా నా హృదయం
యేసు నీ కృపయేగా – ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా – వేరే లేదుగా !
1.వేషధారివని లోకం వెక్కిరించుచుండగా
దారి మరచి నిన్నే విడిచి నీకు దూరమవ్వగా
కోర్కెలన్ని కన్నీలై – కడకు నిన్ను చేరగా
కనికరించి ఓదార్చి స్వీకరించినావుగా
యేసు నీ కృపయేగా – ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా – వేరే లేదుగా !
2.ఏ యోగ్యత లేని నన్ను నీవెన్నుకున్నావు
నీ ఉన్నత సేవకు నన్ను పిలుచుకొన్నావు
ఉప్పులా ఉండాలని – ఊటనై పారాలని
నీలోన నిలచి నే ఫలియించాలని
యేసు నీ కృపయేగా – ఇది నీ కృపయేగా
ఇది నీ కృపయేగా – వేరే లేదుగా !