నేస్తమా ప్రియ నేస్తమా – Nesthama Priya Nesthama Lyrics
నేస్తమా ప్రియ నేస్తమా – Nesthama Priya Nesthama Lyrics
పల్లవి: నేస్తమా —— ప్రియనేస్తమా
ఎవరు నీకిచ్చారు- విలువైన ఈ జీవితం
ఎచటకో నీ పయనం- ఏమిటో నీ గమ్యం
తెలుసుకో ముందుగా- ఆ పైన సాగించు నీ ప్రయాణం
1. ” చ” జీవితమెంతో చిన్నది- సమయం అతివిలువైనది
దీపముండగా- నే ఇల్లు చక్కదిద్దుకో
మార్గము ఇరుకైనా- ప్రవేశించి నిత్యజీవమందుకో
యేసే మార్గం- మరోదారిలేదనేది సత్యం -” నేస్తమా ”
2. “చ” పాపానికి జీతం మరణం- పరిహారం యేసయ్య ప్రాణం
ప్రాణం పెట్టిన యేసయ్యను- నమ్ముకో
రక్షణ పొందుకొని – నిత్యమైన పరలోక రాజ్యం చేరుకో
యేసే మార్గం- మరోదారిలేదనేది సత్యం -” నేస్తమా ”
3. ” చ” కోరికల కడలిలో- నీవు కొట్టుకొని పోవద్దు
లోకాశలకై పరుగిడి- యేసయ్యను మరువద్దు
నీవు పొందుకున్న రక్షణను- నిర్లక్ష్యం చేయొద్దు
యేసే మార్గం- మరోదారిలేదనేది సత్యం -” నేస్తమా