ఫలములునాసించిన పరలోక తండ్రి – Phalamulunasinncina paraloka tandri
Shop Now: Bible, songs & etc
ఫలములునాసించిన పరలోక తండ్రి – Phalamulunasinncina paraloka tandri
ఫలములునాసించిన పరలోక తండ్రి
తేరిచూచుచున్నాడు నీ వైపు “2”
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి
పరీక్షించుచున్నాడు నీ కాపు
అ. ప.: ఫలియించకుండుట నీకు న్యాయమా
యజమాని సహనముతో చెలగాటమా “2”
1. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు
సంఘద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు “2”
చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు”2″
తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరిచినాడు “2”
2. వెదికినపుడు నీ యొద్ద ఫలము లేకయుంటే
ఆకులతో నినుచూసి తండ్రి సంతసించున “2”
ఇవ్వబడిన సమయములో వర్డిల్లకుంటే “2”
మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండున “2”