యేసయ్య నీ పర్వతములలో ఉండువాడేవడు – Yesayya ni parvatamulalo
Shop Now: Bible, songs & etc
యేసయ్య నీ పర్వతములలో ఉండువాడేవడు – Yesayya ni parvatamulalo
పల్లవి: యేసయ్య నీ పర్వతములలో ఉండువాడేవడు?
యేసయ్య నీ మందిరములలో నివసించువాడేవడు?
యేసయ్య నీ ఆజ్ఞ ననుసరించి నడిచినవాడే కదా!
అ. పల్లవి: యేసయ్య యేసయ్య మా యేసయ్యా
మా గుండెల్లో కొలువై ఉండవయ్య. “2”
చరణం1: నీ మందిరంలో ఒక దినము వెయ్యి దినముల కంటే శ్రేష్ఠము.
నీ మందిరములో పచ్చని ఓలివనై యుందును.
అ. పల్లవి: యేసయ్యా యేసయ్యా నా యేసయ్య
ఆత్మ ఫలములు ఫలింపజేయుమయ్య “2”
చరణం2 : నేనైతే అనుదినము నీ వాక్యం ధ్యానించెదను.
విడువక నిత్యము ప్రతీ ఉదయం నీ ముఖ దర్శనం చుచెదను.
అ. పల్లవి: యేసయ్య యేసయ్య మా యేసయ్యా
మీ స్వరుప్యమును మాకు కియ్యుమయ్య “2”
చరణం3 : పరలోకమే నా గమ్యముగా నా పయనము కొనసాగించెదను.
శోధనలెన్నేదిరైనను నా పరుగును కడముట్టించెదను.
అ.పల్లవి : యేసయ్య యేసయ్య మా యేసయ్యా
నను వధువుగా సిద్ధ పరచుమయ్య. “2”