Shop Now: Bible, songs & etc
శిరమున ముళ్ళ కిరీటమా Lyrics
శిరమున ముళ్ళ కిరీటమా!
శిరమున ముళ్ళ కిరీటమా!
శిరసా వహించిన ఓ దైవమా!
సిలువలో నీదు మరణమా!
శాపవిమోచనకై త్యాగమా!
నీ వదనముపై ఉమ్మితిరా!
నీచులు కొరడాలతో కొట్టిరా!
నీ ప్రక్క బల్లెముతో పొడిచిరా!
నా కొరకేగా నీ వేదన!
నీ కాలు సేతులలో సీలలా!
నీ నోట చేదు ద్రాక్షారసమా!
నీ తనువు పరిశుద్ధ సంస్కారమే!
నీ శ్రమలు నా రక్షణ భాగ్యమే!