AKASHAM MAARINA – ఆకాశం మారిన భూలోకం మారిన
AKASHAM MAARINA – ఆకాశం మారిన భూలోకం మారిన
ఆకాశం మారిన భూలోకం మారిన
ఆది నుండి మారనిది ప్రభు వాక్యమే కదా
స్నేహితులే విడిచినా నీ వారే మరచినా
నాడు నేడు మరువనిది ప్రభు ప్రేమే కదా
వాక్యమునే విత్తనములుగా విత్తగా
స్థిర జీవమనే పంటను ఫలముగా పొందనా ౹౹2౹౹
1. భూలోకమా మెలకువ కలిగి
ప్రభు వాక్యముకై హృదయమునిమ్ము ౹౹2౹౹
దుష్టుని మార్గములో నీకు ఫలమే రాదు ప్రభువే తోడుంటే కొదువే లేదు ౹౹2౹౹ ౹౹ఆకాశం౹౹
2. ఓ నేస్తమా పరమున చేరా
స్థిరపడి నీవు త్వరపడి రమ్ము ౹౹2౹౹
రాజుల రాజై యేసు రానై ఉండే
నిన్ను నన్ను పరలోకం చేర్చున్ ౹౹2౹౹ ౹౹ఆకాశం౹౹