![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Alala Paina Nadachina Nadu Yesayya – అలలపైన నడచిన నాదు యేసయ్యా
Alala Paina Nadachina Nadu Yesayya – అలలపైన నడచిన నాదు యేసయ్యా
అలలపైన నడచిన – నాదు యేసయ్యా
గలిబిలి నా కలవరములను ||2||
తొలగజేసిన కలుషహరుడా
ఆదుకోవయ్యా నాదు యేసయ్యా
శుద్ధుడా నీ పిలుపు వింటిని అద్దరికి నే పయనమైతిని
ప్రొద్దుబోయెను భయములాయెను ||2||
ఉద్ధరింపగ స్వామి రావా
నట్టనడి సంద్రాన రేగె అట్టహాసపు పెనుతుఫాను
గట్టుచూడగ చాల దూరము ||2||
ఇట్టి శ్రమలో చిక్కుకొంటిని
అలలు నాపై విసరి కొట్టగ నావ నిండుగ నీరు చేరె
బ్రతుకుటెంతో భారమాయెను ||2||
రేవు చేరే దారిలేదే
మాట మాత్రపు సెలవుచేత నీటుగా అద్భుతములెన్నో
చాల చేసిన శక్తిమంతుడు ||2||
జాలిజూపి దరిని చేర్చవా
చిన్న జీవిత నావనాది నిన్నెగురిగా పయనమైతిని
ఎన్నోశోధనలెన్నో భయములు ||2||
గన్న తండ్రి కానరావా