![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Banda Sanduna Pavurama – బండసందున పావురమా
Banda Sanduna Pavurama – బండసందున పావురమా
బండసందున పావురమా – పేటుబీటుల పావురమా
ప్రియుడు నిన్ను కోరినాడు – భీతి చెందకుమా
వరుడు నిన్ను కోరినాడు – కలత చెందకుమా
సిద్ధపడుమా ఓ సంఘమా
క్రీస్తు వచ్చు వేళాయె వేచియుండుమా
యేసు వచ్చు వేళాయె వేచియుండుమా
ప్రియుడు నిన్ను కోరెను – నీ వరుడు నిన్ను కోరెను
నీ స్వరము వినిపించుమా – నీ ముఖము చూపించుమా
యేసురాజు దిగువచ్చు వేళ ||2||
నీవు సంసిద్ధమా – నీవు పరిశుద్ధమా ||సిద్ధ||
కొండ పేటులందున – బండ బీటులందున
నీ గూడు నిర్మింపుమా – నీ ప్రియునికై చూడుమా
లోక ఆశలు నీకేలనమ్మా ||2||
సిద్దె వెలిగించుమా – సిద్ధముగ నుండుమా ||సిద్ధ||
సాగరాలు పొంగినా – నింగి నేలకొరిగినా
భయమేల ఓ సంఘమా – దిగులేల ఓ సంఘమా
బండక్రీస్తే నీ అండనుండ ||2||
గీతములు పాడుమా – నీ ప్రియుని వీక్షింపుమా ||సిద్ధ||
ద్రాక్షచెట్టు పూతపట్టి – వాసనలిచ్చుచున్నవి
చలికాలమే గడిచెనమ్మా – నిదురేల నీకింకలెమ్మా
వరుడు యేసు దిగివచ్చు వేళ ||2||
తరుణ మేతెంచెనమ్మా – నీ ప్రియుని సంధించుమా ||సిద్ధ||