![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
Bethlehemu Urilona – బేత్లెహేము ఊరిలోన కన్య
Bethlehemu Urilona – బేత్లెహేము ఊరిలోన కన్య
బేత్లెహేము ఊరిలోన కన్య మరియ గర్భమున
పుట్టినాడు నేడంట మన రాజులరాజు
బేధం ఏమి లేనే లేదు ఈ లోక రక్షణకై
పుట్టినాడు నేడంట మన రక్షకుడేసు
మనమంత ఏకస్వరమై ఆరాధించి చాటెదము
ఈ క్రిస్మస్ ప్రస్తుతి పరమార్ధం ఊరంతా తెలిపెదము
1.ప్రకాశమానముతో తారొకటి వెలువంగా
శుభవర్తమానముతో దూతోకటి ఎదురవగా
మనకొరకు రక్షకుడేసు జన్మించినాడని
ఆయనే రాజుల రాజు ఇమ్మానుయేలని
2.ఆనందభరితులై జ్ఞానులు అందరు సాగంగా
ఆ బాల యేసుని చూచి సాగిలపడి పూజింపంగా
బంగారు సాంబ్రాణి బోళము కానుకలర్పించిరి
ప్రజలందరికి చాటింప సంతోషముగా సాగిరి