Sandhadi 6 – సంబరం ఆశ్చర్యాలతో భూమి Lyrics

Faith Score0
Faith Score0

Sandhadi 6 – సంబరం ఆశ్చర్యాలతో భూమి Lyrics

సంబరం ఆశ్చర్యాలతో భూమి ఊపిరి బిగబట్టనే
శిశువు మృదువు హస్త స్పర్శను పుడమి ముద్దాడనే
ఆకాశం చుక్కలతో అలంకరించని
అందులో ఒక తార రక్షకుని జాడ తెలిపెనే

చమ్మక్కు చమ్మక్కు మంటూ ఒక తార వెలసెనే
నింగి నేల ఏకమై సందడి చేసెనే
కన్యక గర్భాన రారాజు పుట్టాడే
ఊరు వాడ వీధులలో సందడి చేద్దామే

Chorus:
సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే
బేత్లెహేము పురములోన సందడి చేద్దామా
సందడి సందడి సందడి సందడి సందడి చేద్దామే
దావీదు పురములోన సందడి చేద్దామే

Verse:1
నక్షత్ర రాశులు వింత కాంతులు ఈనే
సర్వదూతాలి సిద్దపడెనే
యుగయుగాల నిరీక్షణ ఫలియించెనే
సర్వ సృష్టి నీ రాకకై సాక్ష్యమిచ్చెనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ
భూమిపై ఉన్న వారికి సమాధానం అని దూత చెప్పెనే

Verse :2
అయ్యో మరియమ్మ అవమానము పొందే
గాబ్రియేలు దూత వచ్చి భయపడకని చెప్పెనే
పుట్టబోవు బిడ్డ పరిశుద్ధుడని చెప్పెనే
సర్వోన్నతుని కుమారుడని చెప్పెనే
యుగయుగాలనేలే రారాజు
నీలో నుండి వచ్చుననెనే
ఇమ్మానుయేలు దేవుడు
ఏసుక్రీస్తు అని చెప్పెనే

Verse: 3
నదులు సంతోషముతో ఉప్పొంగెనే
అలలు నాట్యమాడి స్తుతియించెనే
సస్యశ్యామలం గుసగుసలాడే
శాంతి సమాధానం వచ్చిందని చెప్పెనే
సర్వ భూమి నీ రాకతో పరవశించెనే
సృష్టి తలవంచి స్వాగతించెనే

Latest Telugu Christmas song 2023 Sandhadi 6 Joyful Noise

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo