Shop Now: Bible, songs & etc
Devuni Alayam – ఈ దేహమే దేవుని ఆలయం
ఈ దేహమే దేవుని ఆలయం – పరిశుద్ధ పరచుము దేవా
మహిమగల సంఘముగా – సిద్ధపడిన వధువుగా
నీ ఎదుట నిలుచుటకు శక్తినీయమా !
మహిమగల సంఘముగా – సిద్ధపడిన వధువుగా
నీ ఎదుట నిలుచుటకు కృపనీయుమా !
1. పాపములో పుట్టిన నన్ను – నీవు ఏర్పరచినావు
ఈ పాపి కోసం మహిమను విడచి – భువికి ఏతెంచావు
సిలువలో ప్రాణం పెట్టావు – రక్షణ భాగ్యము నాకిచ్చావు
దయాదాక్షిణ్యములతో నన్ను – ప్రధానము చేసికొన్నావు
2. శాశ్వతమైన నీ ప్రేమను – నాపై చూపించావు
సుందరుడా అతిమనోహరుడవై – నీ ప్రేమను నాపై ధ్వజముగా నిలిపావు
నీవు నా ప్రియుడావు – నీపైనే ఆనుకొందును
నీ రాకతో నా జీవితం – పరిపూర్ణత చెందును