Ekantha Sthalamu Korumu Devuni Prardhimpa – ఏకాంత స్థలము కోరుము

Ekantha Sthalamu Korumu Devuni Prardhimpa – ఏకాంత స్థలము కోరుము

ఏకాంత స్థలము కోరుము – దేవుని ప్రార్ధింప –

ఏకాంత స్థలము చేరుము

ఏకాంత స్థలము చేరి – మోకాళ్ళ మీదవుండి

లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము

ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రి యెదుట

దేహము లోకలకవియె – దిగును నిన్ను బాధ పెట్టును

మాటలందలి పాపములను – మన్నించుమని వేడుకొనుము

ఆటపాటలందు మాట – లాడుటయు నేరంబులగును

చేయబోయి మానుచెడ్డ – చేతలన్ని ఒప్పుకొనుము

ఈయత్న పాపంబులెల్ల – ఎన్నికలోనికి వచ్చును గాన

పాపక్రియలు అతి దుఃఖముతో – ప్రభుని యెదుట ఒప్పుకొనుము

పాపము మరల చేయనట్టి – ప్రయత్నంబుల్‌ చేయవలెను

ఎవరిని అల్లరి పెట్టినావో – వారియొద్ద ఒప్పుకొనుము

ఎవరి యొద్ద చెప్పినావో – వారియొద్ద ఒప్పుకొనుము

తప్పు వినుట సర్దాయైన – తప్పే తప్పు ఒప్పుకొనుము

తప్పు తట్టు ఆకర్షించు – తగని ఆటపాటలేల

కలలో చేసిన తప్పులెల్ల – కర్త యెదుట ఒప్పుకొనుము

తలపులో లేనిది యెట్లు – కలలోనికి వచ్చి యుండును

నిన్ను మరల సిలువవేసి – యున్న పాప జీవినయ్యో

నన్ను క్షమియించుమని యన్న – నరులు మారువారు

చెడుగుమాని మంచి పనులు – చేయకున్న పాపమగును

పడియు లేవకున్న గొప్ప – పాపమగును పాపమగును

దుష్టులు వర్ధిల్లుట చూచి – కష్టము పెట్టుకొనరాదు

కష్టము పెట్టుకొన్న నీవు – దుష్టుడవుగా మారినట్టే

భక్తిపరుల శ్రమలు చూచి – భక్తిహీనులనవద్దు

భక్తుల శ్రమలకు ముందు – బహుమానంబు దొరుకగలదు

బీదల కాహారము బెట్ట – వెనుకదీసి పొమ్మనరాదు

నీ ధనము నీకే కాదు అది – నిను గని దేహియను వారికిని

రోగులను దర్శింప బోవ – రోతయని భావింపవద్దు

బాగుపడు పర్యంతము వరకు – పరిచర్య చేయుట మెప్పు

ఎట్టి యబద్దాలు పలుకు – నట్టివారికి నరకమంచు

చిట్టచివరి పుస్తకంబు – చెప్పునది యోచన చేయుము

జీవరాసులను బాదుట – జీవహింస నేరమౌను

దేవుడు నిన్నడుగ జెప్పు – తెగువ గలుగ గలదా నీకు

ఒకరి వంక మీద ప్టిె ఒకరి ననుట పిరికి తనము

ముఖము యెదుట అడిగి స్నేహ – మును గలిగించుకొనుట మెరుగు

గుడిలో కూర్చొని కార్యక్రమము – గుర్తింప కుండుట యశ్రద్ధ

చెడగొట్టి వేయుచుండు – పెడచూపు మనోనిదానము

వాక్యాహారము తినని యెడల బలమాత్మకు లభించుటెట్లు

వాక్య గ్రంధములోని దేవుని – పలుకు వినక నడుచుటెట్లు

దిన ప్రార్ధనలు చేయని యెడల – దేవుని శ్వాస పొందుటెట్లు

మనసులోని స్వీయ శ్వాస – మలినము పోవుట యెట్లు

పరులకు బోధించు సేవ జరుపలేక యున్న యెడల

పరమ భక్తి పరులకైన – బహుమానంబు దొరుకుటెట్లు

ప్రభువు కొరకు పనిచేసిన – వారికి తాను బాకీ పడడు

సభ నిమిత్తము చేసినది తన – స్వంతము కన్నట్టె యెంచు

చందా నీది కాదు క్రీస్తు – సంఘాభివృద్ధికే చెందు

చందా వేయుము ప్రభువు నీకే – చందా వేయును నీకే అది

యేసు నామమందు మనము – యేది చేసిన సఫలమగును

యేసుక్రీస్తు పేరున చేయు – నేదైన దేవునికి మహిమ

దేవా! నాకు కనబడుమన్న – దేవ దర్శనమగును నీకు

పావనంబగు రూపము చూచి – బహుగా సంతోషించగలవు

దేవా! మాటలాడుమన్న – దేవ వాక్కు వినబడు నీకు

నీవు అడిగిన ప్రశ్నలకెల్ల – నిజము తెలియనగును నీకు

తప్పు వివరము చెప్పకుండ – తప్పు మన్నించుమని యన్న

తప్పు తప్పుగానే యుండు – తప్పుదారి వృద్ధి పొందు

ఏడు తరగతులున్నవి నీది – ఏదో తెలిసికొనుము ఇపుడే

కీడుమాని మంచి చేసిన – క్రింది తరగతి దొరుకునేమో

నరుల మీద ప్రేమ క్రీస్తు – వరుని మీద ప్రేమయున్న

పరలోకమున వరుడు ఉన్న – పై తరగతిలోనే చేరెదవు

ఆలోచింపకుండ ప్రశ్న – అడుగవద్దు నరుడు కాడు

నీలోని జ్ఞానము వలన – నిరుకు తెలిసిన వడుగ నేల

మోటు మాటలాడవద్దు – మోటు పనులు చేయవద్దు

చాటున చేసిన పాపములు – సమయమపుడు బైలు పడును

ఉత్తర మాలస్యముగా వచ్చిన – ఉత్తరమసలే రాకయున్న

ఉత్తమ విశ్వాసమును ప్రార్ధన – ఉత్తవియై పోవును విచారము

వ్యర్ధమైన ఊహలు మాటలు – పనులు నిన్ను వ్యర్ధ పరచును

తీర్ధము వలెనే పాపము త్రాగిన – తీర్పు శిక్ష సహింపజాలవు

ఏ పాపమునకైన పరుల -కే శిక్షయును రాకుండెను

నా పాపములకు శిక్ష కలుగు – నా? యన్న అజ్ఞానమగును

ఉదరమునకు శరీరమునకు – ఉండవలెను శుద్ధి గాని

హృదయశుద్ధి చేసి ప్రభుని – యెదుికి రావలెను సుమ్మీ

సభకు వేళ రానప్పుడు – ప్రభువే రాత్రి భోజనమిచ్చు

సభకు వేళ వచ్చినప్పుడు – సభతో కలిసి పుచ్చుకొనుము

ఎంత ఎన్ని శ్రమలు రాగా – యేసుని బ్టియైన మేలే

సంతోషించుము అంతము వరకు – సహియించిన ధన్యత కలుగు

ఇల్లు వాకిలి సామానులు – యెల్ల శుద్ధిగ నుండవలెను

ఉల్లాసముతో దేవుని సన్నిధి – నూరక యుండవలెను విసుగక

కోపము ద్వేషము తప్పుడు భావము – కుాలోచనతో కూర్చుండుట

శాపారోపణ తిక్క యిట్టి – సకల దుర్గుణములు ముప్పే

దిద్దుకొనుము నిన్ను నీవే – దిద్దగలవు సభను పిదప

దిద్దుకొనని నీ కంటిలో – పెద్ద దూలమందురు కొందరు

సన్నిది యందె అన్నియు పరి – ష్కారమగును తెలిసికొనుము

సన్నిధిలో నీవున్న యెడల – సన్నిధి నీలో వుండును సుమ్మీ

ప్రార్ధన వాలు రానప్పుడు – ప్రార్ధన ఎక్కువ చేయవలెను

ప్రార్ధన యేసు నామమందు – అర్ధములతో బైలు దేరును

ఎక్కువ పనులు వున్ననాడే – ఎక్కువ ప్రార్ధన చేయవలెను

ఎక్కువ పనిలోని సగము – అక్కడపుడే సఫలమగును

నీవు నాపనిమీద వెళ్ళుము – నేను నీ పనిమీద వెళ్ళుదు

ఈ విచిత్రమైన మాట – యేసుప్రభువు పలుకుచుండు

జనకునికి తెలియదా? అనుచు – మనవి చేయుట మానరాదు

మనవి విందునన్న తండ్రి – మనవి మానివేయుమనెనా?

ఎప్పుడు చెడుగు నీలోనికి – ఎగిరి వచ్చునో అప్పుడే

అప్పుడే నరక మార్గమందు – అడుగు బ్టెిన వాడవగుదువు

ప్రతిదియు నీ మనస్సులోనే – ప్రార్ధన లోనికి పెట్టవలయు

మతికి జవాబిచ్చును తండ్రి – స్తుతులుగ మార్చు ప్రార్ధన లెల్ల

చిన్న పాపమైన ఆత్మ – జీవమున్‌ తగ్గించుచుండు

చిన్ని చిల్లి పాత్ర నీటిన్‌ – చివరకు లేకుండా జేయును

దేవదూతలు నీ యొద్ద – కావలిగా నుందురు గాని

కావలి లేదను సైతాను – సేవకులు కూడ ఉందురు

నీకు మోక్షము లేదను మాట – నిత్యము వినబడుచునుండు

నాకు క్రీస్తుని బట్టి మోక్షము – లేకుండ పోదనచు నుండుము

కష్టాల మేఘముల వెనుక – కలడు నీతి సూర్యుడు క్రీస్తు

దృష్టించు చున్నాడు నిన్ను – దిగులుపడకు దిగులుపడకు

నరలోక పాపాలు చూడు – నరకమునకు నిను దిగలాగు

పరలోకము వైపు చూడు – పైకి నిన్ను ఎత్తుచుండు

జనక సుతాత్మలకు తగినట్టు – సంస్తుతి చేయలేము మనము

మనకు చేతనైనంత – మట్టునకు చేయుదము లెండి

We will be happy to hear your thoughts

   Leave a reply

   Tamil Christians Songs Lyrics

   Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

   Disclosures

   Follow Us!

   WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
   Logo