ఎవ్వరు ఉన్నా లేకున్నా – evvaru unna lekunna
ఎవ్వరు ఉన్నా లేకున్నా – evvaru unna lekunna
ఎవ్వరు ఉన్నా లేకున్నా నీవుంటే చాలు
ఎవరేమనుకున్నా నీ తోడుంటే చాలు !!2!!
యేసయ్య నీవుంటే చాలయ్య
నాతో నీవుంటే చాలు.. నీ తోడుంటే చాలు ..
నీవు నాకుంటే చాలు ..నీతో నిలిచుంటే చాలు
!! ఎవ్వరు!!
1. లోకంతో కలిసాను లోతు భార్యగా మారాను
పాపులతో కలిసాను ఘోరపాపిగా మారాను !!2!!
రెక్కలు తెగిన పక్షిగా నశియింపబడిన వ్యక్తిగా !!2!!
మారిన జీవితం గమ్యమే అగోచరం !!2!!
!!ఎవ్వరు!!
2. ప్రార్థనలు చేసాను..ప్రవచనాలు పలికాను..
భోధలెన్నో చేశాను ..భాషలతో మాట్లాడాను !!2!
తోటివానిని ప్రేమించుట నీకిష్టమైనదని మరచాను !!2!!మన్నించుమా ఈ క్షణం నీ పాదమే ఆశ్రయం !!2!!
!!ఎవ్వరు!!