![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Lokamantha Muniginanu Chimma Chikati Kamminanu – లోకమంత మునిగినను చిమ్మచీకటి కమ్మినను
Lokamantha Muniginanu Chimma Chikati Kamminanu – లోకమంత మునిగినను చిమ్మచీకటి కమ్మినను
లోకమంత మునిగినను చిమ్మచీకటి కమ్మినను
ఎదురుగాలి విసరినను ఎండగాలి యుడినను
గండములలో నుండగానే గుండెదిగులు చెందగా
అండగా యెహోవా నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..
తీర్పరులు నిన్నుచూచి తప్పుగ భావించినను
లేనిపోని నేరములను భారములను మోపినను
ఘోరమైన సిలువ నీవు మోయవలసి వచ్చినను
అండగా యెహోవా నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..
తాళలేక నిన్నుచూచి గేలిచేసి నవ్వినను
నీతి న్యాయములకు నిన్ను వేరుచేసి పోయినను
తరమువారి ఉరవములు తరలివచ్చి పైనిబడన్
అండగా యెహోవా నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ..
మనుష్యుడా నీకేమి భయము
మనుజులేమి చేయగలరు
మహిమగల రాజు క్రీస్తు రాక సమీప్యంబు సుమీ
అన్ని సంగతులను దెలుపువాడు
క్రీస్తు నిజము నరుడా
అట్టి యేసుక్రీస్తు నీకు తోడు నీడగా నుండు
ఆఆ.. ఆఆ.. ఆఆ.. ఆఆ