Na Thalampantha Nive Yesayya – నా తలంపంతా నీవే యేసయ్యా
Shop Now: Bible, songs & etc
Na Thalampantha Nive Yesayya – నా తలంపంతా నీవే యేసయ్యా
నా తలంపంతా నీవే యేసయ్యా
నే కోరేదంతా నీతోడేగదయ్యా
ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ
నీ సేవయే నా భాగ్యం యేసయ్యా IIనాII
అణువణువు నా ప్రాణమంతా
వేచియున్నది నీకై నిరతము
నీవే నాదు సర్వము ప్రభువా IIనాII
నిన్ను ఎరుగక నశించిపోతున్న
ఆత్మల భారం నాలో రగిలే
నీకై నేను ముందుకు సాగెద IIనాII
నలిగిపోతుంది నా ప్రియ భారతం
శాంతి సమాధానం దయచేయుమయా
రక్షణ ఆనందం నింపుము దేవా IIనాII