Shop Now: Bible, songs & etc
Neevicchina Varame – నీవిచ్చిన వరమే
నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం “2” నను కాచావు నను దాచావు పోషించి నడిపావు భలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు’ హల్లేలూయ ఆరాధన – హల్లేలూయ స్తుతి ఆరాధన ‘ “2”
1 ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా పెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసిన చుక్కానివి నీవై నా నావికుడవు నీవై “2” ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై ‘2’ హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన”2″
2 మరల తిరిగి రావు నీవు గడిపిన దినములు వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు “2” ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున “2” చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం “2” ‘హల్లేలూయ ఆరాధన హల్లేలూయ స్తుతి ఆరాధన ‘ “2”
Previous