Ninnu Nammutache – నిన్ను నమ్ముటచే నాకు
Shop Now: Bible, songs & etc
Ninnu Nammutache – నిన్ను నమ్ముటచే నాకు
నిన్ను నమ్ముటచే నాకు భయము లేదు-నిన్ను నమ్మటచే నాకు కొరత లేదు
నిన్ను నమ్ముటచే నాకు దిగులు లేదయ్యా
నిన్ను నమ్ముటచే వెంబడించుటచే
ఏ భయము దరి చేరలేదు దరి చేరలేదు
1) ఆపదలోన ఆధారమై – బాధలలోన బంధువై
క్షామములోన క్షేమమై – కలవరములో కోటవై ||2||
ఉన్నావు దేవా తోడువై – నడిపావు ప్రభువా నీడవై ||2||
యేసయ్యా నా ప్రాణమా – నా రక్షణా శృంగమా ||2||
2) శోధనలోన శృంగమై – నిందలలోన నిరీక్షణ
కారు చీకటిలో కాంతివై – ఓటమిలోన ఓదార్పువై
నాకు చాలిన దేవుడవై – నేనమ్మదగిన నేస్తమై ||2||
యేసయ్యా నా ప్రాణమా – నా రక్షణా శృంగమా ||2||
Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."