![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
O Yesu Ni Prema Entho Mahaniyamu – ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
O Yesu Ni Prema Entho Mahaniyamu – ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ ||
అగమ్య ఆనందమే హృదయము నిండెను
ప్రభుని కార్యములు గంభీరమైనవి
ప్రతి ఉదయ సాయంత్రములు
స్తుతికి యోగ్యములు ఆఆ… ||ఓ యేసు||
సంకట సమయములో సాగలేకున్నాను
దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
వింటినంటివి నా మొర్రకు ముందే
తోడునుందునంటివి ఆఆ… ||ఓ యేసు||
కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
పచ్చిక బయలులో పరుండ జేయును
భోజన జలములతో తృప్తి పరచుచు
నాతో నుండునేసు ఆఆ… ||ఓ యేసు||
దేవుని గృహములో సదా స్తుతించెదనూ
సంపూర్ణ హృదయముతో సదా భజించెదను
స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
హల్లేలూయా ఆమేన్ ఆఆ… ||ఓ యేసు||