Shop Now: Bible, songs & etc
Prema Nammakamu gala Paraloka Thandri – ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను
ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను
రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను
త్యాగసహిత ప్రేమజూపి నెరవేర్చె తన నిబంధనను
మనలను తానె నిర్మించెగనుక మనలను ప్రేమించెను
శాశ్వత ప్రేమ చూపించెను సిలువపై ఋజువు గావించెను
తన రక్తములో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా
తండ్రివలెనే ప్రేమజూచి నీచులనెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును
ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడు ప్రభుకే
Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."