NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPANU NAA PRABHUVA -Bro. Mk Dilwin

NENU NAA BAADHANU EVARITHO ELA CHEPPANU NAA PRABHUVA -Bro. Mk Dilwin

Lyrics పాట ;👇🏻

పల్లవి:-
నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను నా ప్రభువా – నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను – నా కళ్ళలోన కన్నీరు ఎలా ఆపాను – నా బాధలన్నీయు నీకే తెలిసాయా నా బాధను నీతో పంచుకుంటానయ్యా “2”
|| నేను నా బాధను ”

చ1. శాంతి సమాధానం లేని వాడనై ప్రభు నేను – అలసిన ప్రాణమును అడుగడుగునా ఓటమితో ఒంటరినై యున్నాను – దిక్కు. మొక్కు లేని వాడనై ప్రభు నేను – తల్లి తండ్రి దూరములై బంధలన్ని తెగిపోయి నీ కోసం మిగిలున్నాను నా తల్లివి నీవయ్యా నా తండ్రివి నీవయ్యా – నా కన్ని నీవే నా యేసయ్యా “2”
|| నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను”

చ2. ఆస్తి ఐశ్వర్యం లేని వాడనై ప్రభు నేను ఈ పాప లోకములో చెదరిన మనస్సుతో ఏదో అలా బ్రతికున్నాను – ఆశ ఆనందం లేని వాడనై ప్రభు నేను – తీరలేని బాధ లతో ఆదరించు వారు లేక అందరిలో అలుసైపోయాను – నా తోడుగా రావయ్యా – నా నిడగా రావయ్యా – నా కన్ని నీవే నా యేసయ్యా “2”
|| నేను నా బాధను ఎవరితో ఎలా చెప్పను”

చ3. నింద దూషణ కలిగి ప్రభు నేను – సూటి పోటి మాటలతో హృదయమంత గాయమునై నీవైపే చూస్తున్నాను – మరణం నా ప్రాణం విడువని స్నేహమై నాతో – మరణమే న్యాయమని వేరేగతి లేదని నీ చిత్తం జరగాలని – నా మరణం నీవయ్యా నా జీవం నీవయ్యా – నా కన్ని నీవే నా యేసయ్యా “2”
|| నేను నా బాధను ”
Heart touching Song
by Bro. Mk Dilwin…
____________________________________

అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🏻 చెల్లిస్తున్నాను,
ఈ పాట 2005 సంవత్సరములో రాసిన పాట ఇప్పటివరకు నేను బ్రతికి ఉన్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే ఎందుకంటే నా చిన్నప్పుడే నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసారు ఏ దిక్కు లేకుండా ఎటు వెళ్లాలో తెలీదు ఏం తినాలో తెలీదు ఎక్కడ ఉండాలో కూడా తెలియదు
ఆ బాధను నేను మీతో పూర్తిగా చెప్పలేను ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు 20 సంవత్సరం దగ్గరగా ఒంటరిగా మిగిలిపోయిన సందర్భం అది కానీ నా చిన్నప్పుడు నుంచి నేను దేవుని మాత్రం విడిచిపెట్టే వాడిని కాదు, నాకు ఎవరూ లెక్క చేసేవారు కాదు నాకు ఏడుపు వచ్చిన ప్రతిసారి నా నోటి నుంచి పాట వచ్చేది నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నుంచి దేవుడు నాకు పాటలు రాయడం దయ చేసారు
ఇది నేను చిన్నప్పుడు రాసిన పాట మీరు కూడా నా లాగా బాధలో ఉంటే కష్టాల్లో దేవుని విడవకుండా ఉంటే మీకు దేవుడు విడువకుండా ఉంటాడు ఈరోజు నాకు ఏమీ లేకపోయినా నా దేవుడు ఉన్నాడు అని సంతోషంగా ఉన్నాను పాటలతో మ్యూజిక్ తో వాక్యంతో దేవుడు తన మహిమ కొరకు నన్ను వాడుకుంటున్నాడు ఇది నా జీవితంకి చాలు
దయచేసి నా గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు🙏🏻- బ్రదర్. ఎం.కే దిల్విన్
_____________________________________

నాకు ఎవరైనా ఆర్థికంగా సహాయం చెయ్యాలి అనుకుంటే
Phone pay
9441073267;
9347821276 నంబర్స్ కి పంపగలరు
మీరు ప్రేమతో పంపిన కానుకలు- దేవుని సేవలో
ఆయన పనిలో సహాయకరంగా ఉంటుంది.

దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

🔸Please support our Channel
Like Share and Subscribe 🙏🏻
May God bless you all 🤗

#newteluguchristainsongs #2022Newchristiansongs
#jesus #teluguchristiansongs
#mkdilwin #christiantelugumessages
#Jesutelugusongs
#letestteluguchristiansongs

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo
      Verified by MonsterInsights