Rakshakudu Sri Yesudu – మేలుకో సోదరుడా యేసయ్య మనకై పుట్టాడని
Rakshakudu Sri Yesudu – మేలుకో సోదరుడా యేసయ్య మనకై పుట్టాడని
మేలుకో సోదరుడా యేసయ్య మనకై పుట్టాడని
గమనించుమా ఓ సోదరి…
రక్షణ మనకై తెచ్చాడని [ 2 ]
నీకోసం మరి నాకోసం
రక్షకుడు ఉదయించినాడు
సర్వలోకానికే మహోన్నత
క్రీస్తు వార్తను చాటించేదా
ఈ లోకాన్ని రక్షింప పరలోకం విడిచిన శ్రీ యేసుడు
మన పాప భారం తన భుజము పై మోసిన రక్షకుడు
[ మేలుకో ]
1 చరణం
పరమును వీడి వచ్చాడు గా
తన మహిమను ఇలలో చూపాడు గా [ 2 ]
పసి బాలుడు కాదు నా యేసు
పరమ వైద్యుడు నా ప్రభువు [ 2 ]
ఈ లోకాన్ని రక్షింప పరలోకం విడిచిన శ్రీ యేసుడు
మన పాప భారం తన భుజము పై మోసిన రక్షకుడు
[ మేలుకో ]
2 చరణం
పాపుల కొరకై పుట్టాడు గా
ఆ పరమ తండ్రి ఇలా పంపాడు గా [ 2 ]
నరకము నుండి తప్పించును
నిత్యజీవమును నీకు అనుగ్రహించును
నరకం నుండి తప్పించును
పరలోకము నీకు అనుగ్రహించును
ఈ లోకాన్ని రక్షింప పరలోకం విడిచిన శ్రీ యేసుడు
మన పాప భారం తన భుజము పై మోసిన రక్షకుడు
[ మేలుకో ]