RUPUNICHITHIVI – నీ చేతులతో నను నిర్మించి
RUPUNICHITHIVI – నీ చేతులతో నను నిర్మించి
నీ చేతులతో నను నిర్మించి రూపునిచ్చితివి. నా తల్లి గర్భములో నేనుండగా నన్ను చూచితివి. నీ
ఆజ్ఞలను నేర్పి బుద్ధి జ్ఞానము నిచ్చితివి. //2//
హోసన్నా హోసన్నా నీవె మా దైవమా //2//
చ 1::- నా బ్రతుకు దినములన్ని నీ కృపాక్షేములే నాకు దయచేసి యున్నావు .. నాకు శ్రమ కలుగక ముందే నీ త్రోవలో నను నడిపియున్నావు //2//
నీ వాక్కుచే మమ్మ బహుగా బలపరచి యున్నావు , మా ప్రాణములను నేటి వరకు స్థిర పరచి యున్నావు.
. .// హోసన్న // నీ చేతులతో//
చ.2; నా హృదయమంతా వేదనతో నిండి యుండగా ఓదార్చి యున్నావు.
నీ గొప్ప ప్రేమతో నను ప్రేమించి గొప్పకార్యాలు చేసి యున్నావు //2//
పడియున్న నన్ను పైకి లేపి నను హత్తుకున్నావు. నీ ప్రేమతో నన్ను క్షమియించి రక్షించి యున్నావు
. .// హోసన్న // నీ చేతులతో//
చ 3; నాపాప దోషములన్ని కడిగి నన్ను శుద్దిపరచి పరిశుద్ధ పరచావు , నీయందు భయభక్తుల గలవారిని నీ ఆత్మతో నడిపించు చున్నావు//2//
నాకున్న వారు దూరమైన నను దరికి చేర్చావు , నీకనికరం మాపై చూపి కృప చూపు చున్నావు ..
. .// హోసన్న // నీ చేతులతో//
Tags: telugu christian songs