![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Sarvadhikari Paramopakari Yesutho Nadichedamu – సర్వాధికారి పరమోపకారి
Sarvadhikari Paramopakari Yesutho Nadichedamu – సర్వాధికారి పరమోపకారి
సర్వాధికారి పరమోపకారి
యేసుతో నడిచెదము
ఏ చోటుకైన ఏవేళనైన
క్రీస్తుతో వెళ్ళెదము
1.కష్టాల లోయలో కన్నీటి నిశిలో
కీర్తించి పాడెదము
నష్టాల ఊబిలో నన్నాదుకున్న
యేసుతో నడిచెదము
2.నా పాప భారం తొలగించినాడు
నా ప్రభువు నజరేయుడు
నా ఊపిరైన నా కాపరైన
యేసుతో నడిచెదము
3.ఏ మంచి నాలో లేకున్న వేళ
నన్నెంతో ప్రేమించెను
ప్రేమించి నాకై మరణించినాడు
యేసుతో నడిచెదము
4. దివి నుండి భువికి దిగివచ్చియేసు
నన్నెంత దీవించెను
భువి నుండి దివికి వెళ్ళిన క్రీస్తు
త్వరలోనే దిగి వచ్చును