![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Sharonu Maidanamutho Samamaina Madananbu – షారోను మైదానముతో సమమైన మైదానంబు
Sharonu Maidanamutho Samamaina Madananbu – షారోను మైదానముతో సమమైన మైదానంబు
షారోను మైదానముతో – సమమైన మైదానంబు –
ఏ రాజ్యమందు లేదు – ఎంచిచూడగా
1. ప్రభుయేసు రూపే సంఘ – వధువు ధరియించె నామె
విభవ మేమంచు నేను – వివరింపగలను
2. స్వీయ రక్తమున ప్రభువు – చిన్ని కన్నియను శుద్ధి
జేయ పావురము విం – దాయె స్థిరముగను
3. నిష్పక్ష పాతముతోడ – నిజము చెప్పవలెనన్న
పుష్పవన మిదియొకటియే – పూర్ణార్ధంబున
4. పరమార్ధ కీర్తనంబు – పాడించినదియె యీ
సరసమైన పుష్పాల – షారోను పొలము
5. షారోను పుష్పము విం – సంఘ వధువునకు క్రీస్తు
ఏ రూపమిచ్చెనో నే నెన్నగలనా
6. నానా వర్ణాల పువ్వుల్ – నరదృష్టి నాకర్షించు
మానవశుద్ధి ప్రభుని – మదినాకర్షించు
7. సర్వ పుష్పాలయందు – సంఘవధువె పుష్పంబు
ఊర్విని సిద్ధమౌను – ఉండు పరమందు
8. సూర్యుండు పువ్వులకెంతో – సొగసైన రంగులద్దున్
సూర్యుండైనట్టి యేసు – శుభగుణములద్దున్
9. ఆ యద్దకంబు వాడి – అంతర్ధానంబైపోవు
ఈ యద్దకంబుపోదు – ఇది శాశ్వతముండు
10. వివిధ వర్ణములుగల – విశ్వాసులను పుష్పాలు
భువిమీద మొల్చునట్టి – పుష్పసంఘంబు
11. సభను గురించియునా – ప్రభుని గురించియున్న
శుభవార్త వినుచు చెప్పుచు – సుఖియింపగలను