![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
siluva nundi pravahinche – సిలువనుండి వేగంగ ప్రవహించే
siluva nundi pravahinche – సిలువనుండి వేగంగ ప్రవహించే
పల్లవి: సిలువనుండి వేగంగ ప్రవహించే –
దేవుని ప్రేమ గొప్ప కృపలు
పారి పారి నాలోనికి రావాలి –
ప్రేమ సాగరమై
అ:ప: ప్రేమగల దేవ నాలో నీవు అనుదినము
పెరగాలి నేను తగ్గాలి (2)
1. నిత్యప్రేమ నన్ను వెదకివచ్చెన్ –
శాశ్వత సౌభాగ్యం ఇచ్చితివే
ఈ హీనున్ని చేసితివి ప్రభువునకై –
ఘనమైన పాత్రనుగా
2. లోకములో దరిద్రుడైనను –
నీ ప్రేమ సమాధానం చాలు నాకు
దేవుని ప్రేమ నన్ను నీ ఆత్మచే సంపన్నుని చేసితివే
3. మాయలోకంలో ప్రశంసించుటకు –
ఏదైనను లేదు ప్రాణనాధా
దేవుని ప్రేమ ఒక్కటే నా అతిశయమై –
నా యొక్క ఆనందము