Shop Now: Bible, songs & etc
VIMOCHAKUDU – విమోచకుడు
ఎవరూ లేరని వెతుకుచున్నవా
తోడు ఎవరూ లేక చింతించవా (2)
నిన్ను ప్రేమించే నీ తల్లి లాగా రెండుచేతులు చాచి ప్రేమగా పిలిచాడు(2)
విమోచించే యేసయ్య నీకు తోడుగా వున్నాడు
విమోచించే యేసయ్యా నీకు అండగ వున్నాడు (2)
నువ్వు నమ్మే నీ మనిషే మరచినను..
నువ్వు వెతికే ఆ తోడు దొరకకను (2)
ఒంటరైన జీవితమో భారమైన దుఖమో
నీ బాధ తొలగింప స్నేహితుడు ఉన్నాడు (2) (విమో)
పాపపు ఊబిలో మునిగిపోయిననూ
సాతాను శక్తులతో నలిగిపోయిననూ (2)
నిన్ను విడిపింప సిలువలో నీకొరకు
పాపమును జయించిన రక్షకుడున్నాడు (2)
పరుగెత్తు పరుగెత్తు నీ యేసుని వద్దకు
పరుగెత్తు పరుగెత్తు నీ ప్రభువిని వద్దకు
విమోచించే యేసయ్య నీకు తోడుగా వున్నాడు
విమోచించే యేసయ్యా నీకు అండగ వున్నాడు (2)
Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."