![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
మధురం మనకెంతో హృది – Madhuram Manakentho
మధురం మనకెంతో హృది – Madhuram Manakentho
పల్లవి: మధురం మనకెంతో హృది ఐక్యత ఎంతో (2)
భేదములు మాని వాదములు వీడి వేదము చెప్పెటి బోధలను వాడి (2)
సాదరముగ కూడి సహవసించిన యెడల (2)
||మధురం||
~ ఎంచుకోకు నీవు మించి పరుల కంటె వంచన అది నీకు చించు బ్రతుకును ఎంతో (2)
ఎంచుము ఎదుటవాని మించి బహుగ నీకంటే (2)
పంచు ప్రేమను నీలో పెంచు స్నేహము ఎంతో (2)
||మధురం||
~ ఇద్దరు కూడిన వద్ధకేగు యేసు ఇద్దరడిగిన దానిని వద్దనక ఇచును (2) ఇద్దరు పనిచేస్తే పెద్ద లాభము వచ్చును (2)
వద్దనకు ఈ బుద్ది మొద్దులా పెద్దవై (2)
||మధురం|