రారండోయ్ వినరండోయ్ చక్కనైన – Rarandoai Vinarandoai
రారండోయ్ వినరండోయ్ చక్కనైన – Rarandoai Vinarandoai
పల్లవి.రారండోయ్ వినరండోయ్ చక్కనైన ఈ శుభవార్త దాచుకొనరండోయ్ ఈ వార్త గుండె లోతుల్లో అతిబద్రముగా పరలోక దేవుడే పరలోకం విడిచి మన మధ్యలోన జన్మించెను
పాపం బాపంగ మనిషి మనసును మార్చంగా
నరునిగా ఇలలో జన్మించెను అ.ప-యేసు అను పేరున జన్మించెను నమ్మిన వారందరిని రక్షించును
1. ఎవరు చూడని దేవుడే పరలోకం విడిచొచ్చాడే మహిమంతా విడిచిపెట్టాడే పశుల పాకలో పుట్టాడే|2|
నువ్వు నమ్మితే నీలోన సంతోషము
నువ్వు నమ్మితే నీలోన సమాధానము
నువ్వు నమ్మితే నీ బ్రతుకులో ఉత్సాహము
నువ్వు నమ్మితే నీ దుఃఖం సమాప్తము
పాపం బాపును
శాపం బాపును
పాపం బాపును
శాపం బాపి
నువ్వు కోరే మోక్షం తీసుకువెళ్లును. |అ.ప|
2. ఊహలకందని దేవుడే కన్నులముందుకు వచ్చాడే భాషలకందని దేవుడే
మన గుండెల్ని తట్టుచున్నాడే.|2|
నీ తెలివితో పరలోకం చూడలేవు
నీ ధనతో పరలోకం చేరలేవు పలుకుబడితో పరలోకం చూడలేవు
బలులర్పించి ఆయనను చేరలేవు.
పాపం బాపునని
నమ్మితే చాలును
పాపం బాపునని నమ్మితే చాలును
నువ్వు కోరే మోక్షం తీసుకువెళ్లను|అ.ప|
Tags: telugu christian songs