నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ – Nenellappudu Yehovanu sannutinchedan

నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ – Nenellappudu Yehovanu sannutinchedan

Anthaa Naa Meluke Lyrics:

పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ – (2)
అ.ప. : అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే – (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
అరాధన ఆపను – స్తుతియించుట మానను – (2)
స్తుతియించుట మానను

1. కన్నీల్లే పానములైన – కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2)

2. ఆస్తులన్ని కోల్పొయిన – కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన – గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను – యెహోవా తీసికొనెను – (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక – (2)

3. అవమానం ఎంతైన – నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2)
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2)

4. ఆశలే సమాధియైన – వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని – రక్షణకై ఆనందింతున్‌
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2) – (2)

5. చదువులే రాకున్న – ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న – భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు – (2)
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు – (2)

6. సంకల్పాన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని – (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై – (2)

7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే – (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే – (2)

Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."
We will be happy to hear your thoughts

   Leave a reply

   Tamil Christians Songs Lyrics

   Christian music inspires and comforts believers globally, blending biblical truths with beautiful melodies and meaningful lyrics. This article explores uplifting Christian song lyrics that nurture faith and bring hope in challenging times.

   Disclosures

   Follow Us!

   WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
   Logo